కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్ లో ఉన్న వాటిని అభ్యర్థులకు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఒక గుర్తు కోసం ఎక్కువ మంది పోటీ పడితే డ్రా తీసి గుర్తు కేటాయించారు. అయితే ఇలా కేటాయించిన సింబల్స్ లో కొన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు ఉంది. ఈ కారణంగానే గందరగోళం ప్రారంభమయింది.

విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఎన్నికల సంఘం ఆ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిందని ఇండిపెండెంట్లకు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారు.అయితే అలాంటి ఆదేశాలు తమకు రాలేదని.. చెప్పి రిటర్నింగ్ అధికారి గాజు గ్లాస్ గుర్తు కేటాయించేశారు. అలాగే జగ్గంపేటలో జనసేన పార్టీకి చెందిన సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఆక్కడ కూడా ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. అక్కడ కూడా వివాదాస్పదమయింది.

నిజానికి ఆగాజు గ్లాస్ సింబల్ ను రిజర్వ్ చేయకపోతే అన్ని చోట్లా స్వతంత్రులకు కేటాయించాల్సి ఉంది. కానీ ఇటీవల ఎన్డీఏ కూటమి నేతలు ఈసీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈసీ ఈ మేరకు గాజు గ్లాస్ గుర్తు జనసేనకు రిజర్వ్ చేశారని.. ఇతరులకు కేటాయించరని సమాచారం అందింది. కానీ కొంత మంది రిటర్నింగ్ అధికారులు మాత్రం గాజు గ్లాస్ ను కేటాయించడం .. అదీ కూడా కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో కేటాయించడం సంచలనంగా మారింది.

ఈ అంశంపై ఈసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒక వేళ రిజర్వ్ చేయకపోతే జనసేన పోటీ చేయని అన్ని చోట్లా స్వతంత్రులకు కేటాయిస్తారు. రిజర్వ్ చేస్తే ఇప్పటికే కేటాయించిన వారికి మార్పులు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close