అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ తరపున వచ్చే వారే లేరు. దీంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులు.. తాము స్వతంత్ర అభ్యర్థులమేమో అన్నట్లుగా ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది.
జగన్ కోసం గత ఎన్నికల్లో ఎంతో మంది పని చేశారు. ప్రచారం చేశారు. తల్లి విజయమ్మ దగ్గర్నుంచి సినిమాల్లో మోహన్ బాబు , అలీ, ఫృధ్వీ వరకూ చాలా మంది ప్రచారం చేశారు. చాలా నియోజకవర్గాల్లో తిరిగారు. వీరిలో అందరూ దూరమయ్యారు. చివరికి అలీ కూడా ప్రచారానికి రావడం లేదు. మోహన్ బాబును అడిగే ధైర్యం కూడా ఇప్పుడు వైసీపీ నేతలకు లేదు. వైసీపీ దుస్థితి చూసి ఆ పార్టీ నేతలకే విరక్తి పుడుతోంది. అధికారం వచ్చిన తర్వాత అందరూ దూరమయ్యారు.. ఇప్పుడు … అదీ పోతుంది… నిట్టూరుస్తున్నారు.
మరో వైపు కూటమి కోసం స్టార్ క్యాపంపెయినర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఫృధ్వీ, వరణ్ తేజ్, అంబటి రాయుడు సహా అనేక మంది రంగంలోకి దిగారు. వైసీపీ దుస్థితి చూసి.. అధికారం నెత్తికెక్కించుకుని అంతా తన వల్లే అనుకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో కళ్ల ముందు కనిపిస్తుందన్న సెటైర్లు పడుతున్నాయి.