జూన్‌లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ కోసం భారతజట్టుని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మని కెప్టెన్‌గా నియమించింది. గాయం కారణంగా జట్టుకు దూరమై, ప్రస్తుతం ఐపీఎల్ లో బ్యాటర్, కీపర్ గా సత్తా చాటుతున్న రిషబ్ పంత్ తిరిగి స్థానం సంపాదించుకోవడం విశేషం. ఇది మినహా.. జట్టులో ప్రయోగాలేం చేయలేదు. ఐపీఎల్ లో అదరగొడుతున్న యువ ఆటగాళ్ల పేర్లు పరిశీలనకు వచ్చినా, వెస్టిండీస్, అమెరికాలలో జరిగే ప్రపంచకప్‌లో విభిన్నమైన పిచ్‌లు ఎదురయ్యే నేపథ్యంలో జట్టు సీనియారిటీకే ప్రాధాన్యం ఇచ్చింది. ఐపీఎల్ లో అత్యంత పేలవమైన ఫామ్ కనబరుస్తున్న హార్దిక్ పాండ్యాకు జట్టులో స్థానం దక్కడం ఒక్కటే ఆశ్చర్యకరమైన విషయం.
జట్టు ఇదే: రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, పంత్, శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, అక్షర్ దీప్ సింగ్, చాహల్.
పింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, శుభ్ మన్ గిల్, ఖలీల్ అహ్మద్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా నియమించారు. ప్రధాన జట్టులోని ఆటగాళ్లు ఎవరైనా గాయపడినా, అందుబాటులో లేకపోయినా స్టాండ్ బై ప్లేయర్లని ఎంచుకొనే వీలుంది.
జూన్ 2 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 6న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.