కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. అయోధ్య రాముడి ఫోటో ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని…ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్దమని శశిథరూర్ పేర్కొన్నారు. ఇప్పటికే కరీంనగర్ లో 5 లక్షల మేర ఫోటో ఫ్రేమ్ లను ఓటర్లకు పంచారని ఆరోపిస్తూ శశి థరూర్ అందుకు సంబంధించిన పేపర్ క్లిప్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇంత జరుగుతుంటే ఎన్నికల సంఘం నిద్రపోతుందా అని ప్రశ్నించారు.
శశి థరూర్ చేసిన ట్వీట్ పై బండి సంజయ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయాలని ఫిక్స్ అయిందన్న బండి సంజయ్ , దమ్ముంటే తాను మోడల్ కోడ్ ఆఫ్ కండక్షన్ అమలులో ఉన్నప్పుడు ఫ్రేమ్ లను పంపిణీ చేసినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.తాను నిబంధనలకు విరుద్దంగా ఫోటో ఫ్రేమ్ లను పంపిణీ చేసినట్లు నిరూపిసే ఎలాంటి సవాల్ కైనా సిద్దమేనని స్పష్టం చేశారు.
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టకు కాంగ్రెస్ హాజరు కాలేదు.. తనలాంటి కరసేవకులు ఫోటో ఫ్రేమ్ లను పంచితే కాంగ్రెస్ కు అభ్యంతరం ఏంటని శశిథరూర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. అయినా, తాను ఈ ఫ్రేమ్ లను ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడే పంపిణీ చేశానని శశిథరూర్ కు ఎక్స్ లో రిప్లై ఇచ్చారు.
Congress will not attend Lord Ram’s Pranaprathishta in Ayodhya and now has objection if a Karsevak like me distributed photo frames.
Frames were distributed when there was no model code of conduct in February.
Photo depicting Ayodhya Ram Mandir and Hon’ble PM Shri @narendramodi… https://t.co/hsrk33v4OU
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 1, 2024
అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ ఆధ్యాత్మికంగా తీర్చిదిద్డారని, కరీంనగర్ లోని ప్రతి ఇంటిని అందంగా మలచడంతో జనాల్లో మోడీకి విస్తృత ఆదరణ పెరిగిందని… అనుమానం ఉంటే కరీంనగర్ కు వచ్చి చూడాలని శశి థరూర్ ను కోరారు. బండి సంజయ్ ఛాలెంజ్ పై శశిథరూర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.