నరేష్ ‘అల్లరి’ రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ‘ఆ ఒక్కటీ అడక్కు’తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా విజయాలు సాధించాయన్నది ఎంత నిజమో.. దానికి మించి ఫ్లాపులు వచ్చాయన్నది కూడా అంతే వాస్తవం. అసలు ఎలాంటి సినిమాలు చేయాలో అర్ధం కాని దశలో ‘నాంది’ సినిమా ఆయన కెరీర్ కు కొత్త నాంది పలికింది. అక్కడి నుంచి మళ్ళీ వరుసగా సీరియస్ సబ్జెక్ట్ లు చేశారు. అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ తన పాత పోర్ట్ లోకి వచ్చి ఆ ఒక్కటీ అడక్కు చేశారు.
నరేష్ కి ఇది పరీక్ష సమయం. ఈ సినిమా ఆయనకి చాలా కీలకం. పెళ్లి చుట్టూ నడిచే కథ ఇది. ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వుంది. నరేష్ చాలా కాలం కామెడీకి దూరమయ్యారు. ఈ సినిమాలో తను చేసిన కామెడీ ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అవుతుందనేది పరిశీలించదగ్గ అంశం. ఈ సినిమా విజయం సాధిస్తే కనుక ఆయన మళ్ళీ కొన్ని కామెడీ సబ్జెక్ట్ లపై దృష్టి పెడతారు.