నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే మాత్రం వణికిపోతూంటారు. తాజాగా నారా లోకేష్ మరోసారి యువగళం ప్రచారాన్ని ప్రారంభించారు. బహిరంగసభలకు భిన్నంగా యువతను ఆకట్టుకునేలా ఈ ప్రచారం జరుగుతోంది. ఒంగోలు, నెల్లూరుల్లో జరిగిన యువగళం ప్రచారానికి యువత పోటెత్తారు. తమ భవిష్యత్ కు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు.. ఎలా ఇస్తారు.. అన్న దానిపై వారికి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేశారు.
యువత మద్దతు టీడీపీకి పెరిగేలా చేయడంలో నారా లోకేష్ ప్రత్యేకమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రతో గంజాయి బ్యాచ్ మినహా… అభివృద్ధి చెందుదాం అనుకునే ప్రతి ఒక్క యువతీ, యువకుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తించేలా చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ఉద్యోగం, ఉపాధి, శాంతి భద్రతలు సహా .. భవిష్యత్ కోసం ఏం చేయాలని.. ఎంత కష్టపడాలన్నదానిపై ఓ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు వారిని మరింత మోటివేట్ చేస్తున్నారు.
ఇటీవలి వరకూ శంఖారావం సభలు నిర్వహించారు. అలాంటి సభలు చంద్రబాబు, పవన్, బాలకృష్ణ పెడుతున్నారు. తాను భిన్నంగా యువత కోసం ప్రచారం చేస్తున్నారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పద్దతిలో ఉండే లా డిజైన్ చేసుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని వివరించి.. ఒక్క ఓటు వైసీపీకి పడినా జరిగే నష్టం గురంచి విశదీకరిస్తున్నారు. ఇతర సీనియర్ నేతలను డామినేట్ చేయకూడదన్న ఉద్దేశంతో వీలైనంతగా హైప్ తక్కువ ప్రచారం చేస్తున్న లోకేష్.. యువతను ప్రభావితం చేయడంలో మాత్రం తనదైన శైలి చూపిస్తున్నారని అనుకోవచ్చు.