రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ కూ.. రూ. కోటి 14 లక్షల రెండు చెక్కులను ఇచ్చారు. ఆయన వాటిని మార్చిలో డబ్బు చేసుకున్నారు. అంటే ప్రజాధనం ఆర్జీవీ ఖాతాలో పడిపోయింది. ఇంతకీ ప్రభుత్వానికి ఆర్జీవీ చేసిన సేవ ఏంటి ?. ఏ సేన ద్వారా ఆయన ప్రజోపయోగం చేశారు ? అన్నదానిపై స్పష్టత లేదు. ఏ పనులుు చేసినందుకు ఆయనకు ప్రజాధనం ఇచ్చారోనన్నది తెలియాల్సి ఉంది.
ఆర్జీవీతో రెండు ప్రాపగాండా సినిమాలు చేయించుకున్నారు జగన్. ఆర్జీవీ ట్విట్టర్ ఖాతాను ఐ ప్యాక్ కు అప్పగించారు. ఈ రెండు చేసినందుకు ఏమో ప్రజాధనం పెద్ద ఎత్తున ఆర్జీవీకి చెల్లింపులు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఏదో సేవ చేసినట్లుగా రాసి చూపించేసి డబ్బులు విడుదల చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో టీడీపీ కూడా స్పందించింది. రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వానికి ఏం పని చేశాడో.. ఆయన ఖాతాలో ప్రజాధనం ఎలా చేరిందో జూన్ నాలుగో తేదీ నుంచి బయటకు తీస్తామని ప్రకటించింది.
ప్రభుత్వం మారితే ఆర్జీవీని ఎలా దొరకబుచ్చుకోవాలో టీడీపీ నేతలకు కాస్త సందేహం ఉండేది. సోషల్ మీడియా కేసులు పెడితే రచ్చ అవుతుంది. కానీ ఇప్పుడు వైసీపీ నేతలతో కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నారని కేసు పెట్టడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే.. ఆర్జీవీ తీసుకున్న కోట్లకు .. అధికారికంగా ఏ పనీ చేయలేదు. ఫలానా పని చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టిస్తే మళ్లీ అదో కేసు అవుతుంది. మొత్తంగా ఆర్జీవీ ఎక్కడ దొరకాలని టీడీపీ నేతలు కోరుకుంటారో.. అక్కడ దొరికారని అనుకుంటున్నారు. ప్రభుత్వం మారితే ఇక ఆర్జీవీకి గడ్డు కాలమే.