అభ్యర్థులను మార్చారు వర్కవుట్ అవలేదు. బస్సు యాత్ర పేరుతో తనను తాను మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వర్కవుట్ అవ్వలేదు.. ప్రజలు మార్పు చేయడానికి సిద్ధమయ్యారని స్పష్టత రావడంతో చివరి ప్రయత్నంగా… ఇంటికి వాస్తు మార్పులు చేయిస్తున్నారు జగన్. గురువారం ఆయన ప్రచారానికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉన్నారు. ఎందుకు అంటే వాస్తు నిపుణులతో మాట్లాడి ఇంటికి ఈశాన్యాన ఉన్న బరువును తగ్గించాలని నిర్ణయించుకుని దగ్గరుండి మరీ ఆ పనులు చేయించారు .
జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. ఇంటి పక్కనే క్యాంప్ ఆఫీసు కూడా కట్టుకున్నారు. ప్లెయిన్ గోడలతో కట్టుకున్న ఇల్లు, క్యాంప్ ఆఫీసులకు ప్రజాధనం రెండు వందల కోట్ల వరకూ పెట్టి సోకులు చేయించారు. ఆ సోకుల్లో ఒకటి.. ప్రహరీ గోడలు పది అడుగులు ఎత్తున ఇనుప కచ్చడాల తరహాలో అడ్డం పెట్టుకున్నవి. ఇంట్లో వాళ్లు ఎవరూ కనిపించకూడదని పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న ఈ కచ్చడాలు చాలా బరువుగా ఉంటాయి. ఇంటిని పరిశీలించిన వాస్తు నిపుణుడు… ఈశాన్యం వైపున చాలా బరువుగా ఉందని అక్కడ వాటిని తొలగించాలని సూచించారు.
వెంటనే సీఎం జగన్ దగ్గరుండి ఆ పని చేయించారు. వెల్డర్లు, కట్టర్లతో గంటల్లో ఆ పని చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం జగన్ ఇంట్లో తొర్రిపన్నులా కనిపిస్తూండటం చూసి అక్కడకు వచ్చే వారంతా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక చుట్టూ ఆ పెద్ద ఇనుప కంచె పెట్టి అవసరం ఏముందని సెటైర్లు వేసుకుంటున్నారు. కానీ గెలుపు కోసం ఎవరు ఏం చెప్పినా ప్రస్తుతం దాన్ని ఆచరించే పరిస్థితుల్లో జగన్ ఉన్నారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సవ్యంగా వాడుకుని ఉంటే..ఇప్పుడు ఈ వాస్తు మార్పుల గురించి ఆలోచించాల్సి వచ్చేది కాదేమో . చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు.