రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ బాధితులకు ఎప్పుడైనా న్యాయం జరిగిందా ?. కనీసం అరాచక శక్తులను అడ్డుకున్నారా ? అంటే ఏదీ లేదు. గత ఐదేళ్లలో అత్యంత ఘోరమైన నేరాలు చేసిన వాళ్లు నిర్భయంగా బయట తిరుగుతున్నారు. ఓ కుర్రాడ్ని తగులబెట్టిన వారు వారాల్లోనే బెయిల్ పై బయటకు వచ్చి అదే కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. వైసీపీ నాయకులు చేసే అరాచకాలకు అడ్డే ఉండదు. సీఎం జగన్ పై రాయి వేస్తే హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులు … చలసాని గాందీ అనే టీడీపీ నేత కన్ను పొడిచేస్తే సాదాసీదా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మాచర్లలో పట్టపగలు ఇద్దరు టీడీపీ నేతలపై హత్యాయత్నం చేస్తే..స్టేషన్ బెయిల్ ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాి చేస్తే స్వయంగా సీఎం జగన్ మా కార్యకర్తలకు బీపీ వచ్చిందని చెప్పుకున్నారు. ఇలాంటి మైండ్ సెంట్ ఉన్న పాలకుడి పాలనలో శాంతిబధ్రతలు ఉంటాయని అనుకోవచ్చు.
క్రిమినల్ పాలనలో పోలీసులు ఆయన మైండ్ సెట్ కు తగ్గట్లుగా పని చేయడం ప్రారంభించాయి. నిజాయితీ పరులైన అధికారులు లూప్ లైన్ కు వెళ్లిపోయారు. అరాచకాలు, కేసులు ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి తమకు కావాల్సిన పనులు చేయించుకున్నారు. ఫలితంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రజలకు భరోసా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు. ధైర్యంగా తమ అభిప్రాయాన్ని చెప్పుకోలేని పరిస్థితి ఏపీలో ఏర్పడింది.
ఎవరైనా వైసీపీ నేత అని చెప్పుకుని దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్ వరకూ పోలేం. ఎందుకంటే పోలీసులపైనే అడ్డగోలుగా దాడి చేసినా.. వైసీపీ నేతలపై కేసులు పెట్టకపోగా.. తిరిగి పోలీసులపైనే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కర్నూలులో ఓ మహిళా కానిస్టేబుల్ మద్యం కేసులో వైసీపీ నేత దడి చేస్తే చివరికి ఆ మహిళా కానిస్టేబుల్ పైనే చర్యలు తీసుకున్నారు. మంత్రి అప్పల్రాజు పోలీసుల్ని అడ్డగోలు బూతులు తిడితే భరించారు. అనేక చోట్ల పోలీసులపై దాడులు జరిగాయి. కానీ ఎవరూ నోరు మెదపలేకపోయారు. కానీ పోలీసుల అధికారుల సంఘం నేతలు మాత్రం వైసీపీ నేతల్లా మీడియా ముందుకు వచ్చి తొడలు కొట్టారు.
బాధితులపైనే కేసులు పెట్టడం అన్నది కామన్ గా మారిపోయింది. ఫలితంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు .. మీ ఇంట్లో వారు ప్రశాంతంగా బతుకుతారా అంటే.. ఆలోచించాల్సిన విషయంమే. ఓటేసే ముందు ఇవన్నీ ఆలోచించి.. వైజ్ గా ఆలోచించండి. ఎందుకంటే పొరపాటు జరిగితే.. రేపు మీ ఇంట్లో ఏదైనా జరిగితే మీరే బాధితులై ఉండి. మీరే నిందితులుగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అదే ఓటేసే ముందు ఆలోచించండి