సమంతతో విడిపోయాక.. నాగచైతన్య మరో పెళ్లి చేసుకోలేదు. కాకపోతే… తనకో ‘తోడు’ ఉందన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల మాట. కథానాయిక శోభిత ధూళిపాళ తో చై సన్నిహితంగా ఉంటున్నాడని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని చాలారకాలుగా వార్తలు వచ్చాయి. వాటిపై చైతూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యిందే లేదు. ‘జనాలు ఏవేవో మాట్లాడుకొంటారు.. మాట్లాడుకోనివ్వండి’ అంటూ లైట్ తీసుకొన్నాడు. అయితే రూమర్లు మాత్రం ఆగలేదు. శోభిత ఎక్కడ కనిపించినా నర్మగర్భంగా చైతూ టాపిక్ తీస్తుంటుంది మీడియా. చై దగ్గర కూడా ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు శోభిత కాస్త ఇన్ డైరెక్టుగా చైతూ మేటర్ తీసుకొచ్చింది.
తాజాగా శోభిత ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ”ఐయామ్ నాట్ ఎర్రీవన్ కప్ ఆఫ్ చాయ్.. అండ్ ఇట్స్ ఓకే” అంటూ ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. నేను అందరికీ నచ్చాలని లేదు. అయినా ఫర్వాలేదు అనేది దాని అర్థం. నిజానికి ఎవ్రీవన్ ‘కప్ ఆఫ్ టీ’ అంటుంటారు. శోభిత మాత్రం వెరైటీగా ‘చాయ్’ అంది. నాగచైతన్యని చై.. చెతూ అని పిలుస్తుంటారు. ఆ అర్థంతోనే చాయ్ అని కోట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. నాగచైతన్యతో శోభిత బంధానికి బీటలు వారాయని, అందుకే ఇలా స్పందించిందన్న కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో నిజానిజాల సంగతేమో గానీ, చాయ్‌కీ చైతూకీ లింకు మాత్రం భలే కుదిరిపోయింది. మొత్తానికి ఈ రూపంలో మరోసారి వీరిద్దరి మధ్య వ్యవహారం వార్తల్లోకి వచ్చినట్టైంది.
నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ షూటింగ్ తో తలమునకలైపోయాడు. ‘విరూపాక్ష’ దర్శకుడు చెప్పిక కథకు చై ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. శోభిత చేతులోనూ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అలా ఎవరి కెరీర్లో వాళ్లు బిజీగా దూసుకుపోతున్నారు.