ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా స్పందించని వైసీపీ నేతలు ఇప్పుడు తప్పనిసరిగా స్పందిస్తున్నారు. ఈ చట్టంలో ఉన్న లోపాలపై సమాజంలో ఉన్న ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ఈ చట్టం వస్తే మన ఇళ్లు, పొలాలకు గ్యారంటీ లేదని.. ఏ వైసీపీ నాయకుడు అయినా డిస్ ప్యూట్ పెట్టి తనదే ఆస్తి అని రాయించుకోగలడని క్లారిటీ వచ్చింది.
ఈ విషయంలో వైసీపీకి, సీఎం జగన్ కు మొదట్లో ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కానీ అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉండటంతో స్పందించక తప్పడం లేదు., ఆ చట్టంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మీ బిడ్డ భూములిస్తాడు కానీ లాక్కోడు అంటూ జగన్ చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు ఇది వైసీపీ నేతల్లోనూ మరింతగా చర్చనీయాంశం అవుతోంది. ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని దీనిపై ఏదో ఒకటి చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్రం చేసిందని వాదించారు. కానీ అది కేంద్ర చట్టం కాదని.. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కవర్ మీద ఉంటేనే తెలిసిపోతుంది. ఈ చట్టాన్ని కేంద్రం రెండు సార్లు తిరస్కరించింది. దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఇలా అన్ని విషయాలు ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. వచ్చే వారం రోజుల్లో గత ఐదేళ్లలో జరిగిన భూదందాలపై సమగ్రంగా ప్రచారం జరగనుంది. ఇప్పుడు ఈ చట్టంపై స్పందించడం ద్వారా.. వైసీపీ మరింత గా ఊబిలో కూరుకుపోయింది. చివరికి ఈసీని మేనేజ్ చేసి సీఐడీ విచారణ వేయించుకోవడం ఏ మాత్రం మేలు చేయకపోగా ప్రజల్లో మరింత అనుమానాలను పెంచుతోంది.