తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ అంతా హైప్ అనేనని ప్రచారం చేసుకోవచ్చు. ఇందు కోసం బీఆర్ఎస్, బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అక్కడ కలసిపోయాయి. డీకే అరుణ కోసం .. బీఆర్ఎస్ పని చేస్తోందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
మహబూబ్‌నగర్‌లో పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటులో కూడా బీజేపీ గెలవలేదు. కనీసం గద్వాలలో కూడా బీజేపీ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి సరితను ఓడించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థికి ఆమె పరోక్షంగా మద్దతు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమంటే, రేవంత్‌ను ఓడించడమేనని కమలం, కారు భావిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్ ను పసిగట్టిన రేవంత్…ఇప్పటికే అక్కడ కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నారు. తరచూ పర్యటిస్తున్నారు.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌కు దాదాపు 50వేల మెజార్టీ సాధిస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు బిడ్డపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని… ముఖ్యమంత్రిగా ఉండకూడదని అనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితం తేడా వస్తే పాలమూరుకు వచ్చిన ముఖ్యమంత్రి పోతుందని ఆయన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపునే పోటీ చేసిన డీకే అరుణ గట్టిపోటీ ఇచ్చారు. కానీ ఈ సారి కాంగ్రెస్ అధికార పార్టీ హోదాలో … అదీ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పరిధిలో ఏడు అసెంబ్లీలను గెల్చుకుని కాన్ఫిడెంట్ గా రంగంలోకి దిగింది.