ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి నియమ నిబంధనలు పటిష్టంగా ఉంటాయి. ఎలా సింపుల్ గా అయిపోతుందో అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా పూర్తి చేయాలి. కానీ ఈసీ మొదటి నుంచి ఓ రకమైన తప్పుడు మార్గంలో వెళ్లింది. గందరగోళంతో ఎక్కువ మంది ఓట్లు వేయకపోతే చాలన్నట్లుగా వ్యవహరించింది.
మొదట పోస్టల్ బ్యాలెట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది పెద్ద పజిల్ గా మార్చారు. నియోజకవర్గాల గందరగోళం ఏర్పరిచారు. మీడియాలో ఇదేం పని అని ప్రశ్నలు వినిపించడంతో రెండు రోజులు గడువు పెంచారు. ఫామ్ 12 తీసుకున్న తర్వాత పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై ఎం చేయాలన్నదానిపైనా గందరగోళం సృష్టించారు. చివరికి ఓటింగ్ విషయంలో ఏర్పడిన పరిస్థితులు చూసిన తర్వాత .. ఇలాంటి ఈసీనా సాధారణ ఎన్నికలు నిర్వహించేది అని ఆశ్చర్యం కలగడం సహజం.
ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే మరో సమర్థమైన అధికారితో చేయించుకోవాలి.. కానీ ఈ వ్యవహారం అంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగా ఉంది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో ఓట్లు వేయించకపోతే మంచిదన్న భావనకు వస్తున్నట్లుగా వ్యవహారం ఉంది. ఎవరైనా ఓటింగ్ పెంచాలనుకుంటారు కానీ.. ఇలా ఈసీ నిర్వాకంతో తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఈసీ ఫెయిల్యూల్ గానే కనిపిస్తోంది.