కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారు. ముద్రగడ పై కుమార్తెతో మరింతగా రాజకీయ దాడి చేసే అవకాశం వచ్చినా … వద్దనుకున్నారు. పైగా ముద్రగడను గౌరవించారు.
పవన్ ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు ముద్రగడ పద్మనాభం. రెడ్డి అనే పేరు అంత వరస్ట్ అయిందా అని ఆ వర్గం నేతలు.. ముందూ వెనుకా చూసుకునేలా ఉన్న ఈ సవాల్.. వైరల్ అయింది. ఆయనకు వ్యతిరేకంగా ఆయన కుమార్తె క్రాంతి తెరపైకి వచ్చారు. తండ్రిని వ్యతిరేకించారు. పవన్ ను గెలిపించాలన్నారు. ఆమె తాజాగా ఎన్నికల ప్రచార సభలో పవన్ ను కలిసి.. పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
అయితే ముద్రగడ కుటుంబంలో చిచ్చు పెట్టలేనని.. ఎన్నికలైన తర్వతా ముద్రగడతో మాట్లాడి ఆయన అనుమతితోనే పార్టీలో చేర్చుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇస్తానన్నారు. పవన్ మాటలకు.. ముద్రగడ మాటలతో పోల్చి చూసుకుని సోషల్ మీడియాలో పవన్ పై ప్రశంసలు వస్తున్నాయి. పవన్ తన ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించలేదన్న ఈగోతోనే ఆయనను ఓడించడానికి జగన్ తో ముద్రగడ కలిశారన్న గట్టి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆయన ఈగోను పవన్ గట్టిగా దెబ్బకొట్టినట్లే భావించవచ్చు.