మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. డీప్ ఫేక్ ఆడియోతో పరువు నష్టం కలిగించారని ఓ న్యూస్ ఛానెల్ యాజమాన్యం, రిపోర్టర్ కు పువ్వాడ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఖమ్మం జిల్లాలో సొంత పార్టీ నేతలైన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధులను దుర్భాషలాడుతూ, పార్టీ స్థానిక నాయకులను కాళ్లు , చేతులను నరకాలని పువ్వాడ సలహా ఇచ్చినట్లుగా ఆడియో తీవ్ర కలకలం రేపింది. ఈ ఆడియో ప్రసారం చేసిన ఛానెల్ పై పువ్వాడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ఆడియో తనది కాదని… తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరించిన ఆ న్యూస్ ఛానెల్ యాజమాన్యం, ఖమ్మం జిల్లా రిపోర్టర్ ఉపేందర్ లు తనకు 10 కోట్లు ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఆ ఛానెల్ యాజమాన్యం, రిపోర్టర్ స్పందించాల్సి ఉంది.