ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు. కానీ ఇంత కాలం రాజకీయాల్లో ఉన్న వారికి ఇలాంటి పనులు చేస్తే ఇంకా ఎక్కువ చర్చ జరుగుతుందన్న చిన్న లాజిక్ తట్టకపోవడం ఎదురొస్తున్న ఓటమిని మరింత వేగంగా వెదుక్కోవడం లాంటిదే.
రాజకీయాల్లో ఏదైనా అంశం వివాదాస్పదమవుతున్నప్పుడు దాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి చాలా ప్లాన్లు ఉంటాయి కానీ.. ఆ అంశంపై ఎవరూ మాట్లాడకూడదని నోరు నొక్కితే.. ఇంకా ఎక్కువ మంది మాట్లాడతారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. గెజిట్ కూడా విడుదల చేశారు. అందులో ఉన్న అంశాల గురించి టీడీపీ ప్రచారం చేస్తూంటే.. దుష్ప్రచారం అని కేసులు పెడుతున్నారు. అంటే.. చట్టంలో ఉన్న వాటిని కూడా చెప్పకూడదా.. అలా చెప్పడం ఎలా నేరం అవుతుందో వారికే తెలియాలి.
చట్టంలో చెప్పుకోకూడదనివి ఉన్నాయి కాబట్టే ఇలా నియంత్రిస్తున్నారన్న అనుమానాలు .. ప్రజల్లో ఎర్పడుతున్నాయి. అందులో తప్పేం లేదు. నిజంగానే చట్టంలో ఉన్న విషయాల గురించి కాస్తంత అవగాహన తెచ్చుకుంటే… ఎవరికైనా ఆందోళన వ్యక్తమవుతోంది. మాకు ఈ గోల ఎందుకన్న డౌట్ సహజంగానే వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దీనికి వైసీపీ సమాధానాలు చెప్పుకుండా.. పోలీసుల సాయంతో నోరు నొక్కే పనులు చేస్తోంది.