‘మన్మథుడు’లో కథానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది కదా? ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవకాశాలే వచ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల తరవాత.. లండన్ వెళ్లిపోయింది. అక్కడ థెరపిస్ట్ గా స్థిరపడింది. పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలకు తల్లైంది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై మక్కువ పెరిగింది. ఇటీవల ఓ వేడుకలో నాగ్ తో కలిసి కనిపించింది. అప్పటి నుంచి.. అన్షుపై టాలీవుడ్ ఫోకస్ పెట్టింది.
ఇప్పుడు ఓ మంచి ఆఫర్ అందుకొంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ‘సామజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’లాంటి డీసెంట్ హిట్స్ ఇచ్చిన రాజేష్ దండా నిర్మాత. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం అన్షుని ఎంచుకొన్నారు. రావు రమేష్‌కు అన్షు జోడీగా కనిపించబోతోందని సమాచారం. సందీప్ పక్కన ఓ హీరోయిన్ కావాలి. ఆమె కోసమే అన్వేషణ జరుగుతోంది. ఈనెలాఖరున ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. అయితే ఇటీవల నక్కిన త్రినాథరావు తండ్రి కన్నుమూశారు. దాంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. జూన్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.