పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేదని పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అమ్మిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో జేపీసీ చట్టాన్ని అమలు చేయడంలో సిద్ధహస్తుడు. పుంగనూరులో ఇంత అరాచకం జరుగుతూంటే ఆయన వైసీపీ నేతల జోలికి వెళ్లకుండా ఇతరులపైనా కేసులు పెట్టిస్తున్నారు. రోజు రోజుకు పుంగనూరు పరిస్థితి దిగజారుతూండటం.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వైనం వివాదాస్పదం కావడంతో ఆయనను బదిలీ చేశారు.
ఈ డీఐజీ అసలు ఐపీఎస్ కాదు. ప్రమోటెడ్ ఎస్పీ. ఈ ఐదేళ్లలో ఆయన డీఐజీ వరకూ వచ్చేశారు. ఎంతో మంది ఐపీఎస్ చేసిన సీనియర్ అధికారులు ఉన్నా ఏరి కోరి ఈయననే అనంతపురం డీఐజీగా నియమించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి దాడి చేసినప్పుడు గుంటూరు ఎస్పీ ఈయనే. అన్ని రకాల తప్పులకు పాల్పడ్డారు. ఆ సమయంలో అమ్మిరెడ్డిని రాత్రికి రాతి బదిలీ చేసి కాపాడారు. గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అర్థరాత్రి ఇళ్ల మీదకు పోలీసుల్ని పంపి అరెస్ట్ చేయించేవారు.
రఘురామ ఇష్యూతో ఆయనను బదిలీ చేశారు. కొన్నిళ్లు డీజీపీ ఆఫీసులో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత డీఐజీని చేసి అనంతపురంకు పంపారు. ఆయన చేసే వైసీపీ సేవకు హద్దే లేనట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధం లేదని పోస్టింగ్ లోకి వెళ్లబోతున్నారు. పోలింగ్ కు వారం ముందు ఈ పరిణమం కీలకమే.