జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా చేసి ఉండరన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదు. ఫ్యామిలీ రాజకీయ నాయకత్వం తనదేనని ఆయన తేల్చేశారు. తాను కుటుంబ రాజకీయానికి నేతృత్వం వహిస్తున్నప్పుడు.. తమ కుటుంబం నుంచి షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదన్నది ఆయన అభిప్రాయం.
వైఎస్ రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు ఉందని ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి మోహమాటం లేకుండా చెప్పారు. అంతేనా ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి రాకూడదని అలా వస్తే కుటుంబంలో చీలికకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు. అసలు షర్మిల ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో జగన్ కు బాగా తెలుసు. జాతీయ మీడియా ప్రతినిధులకూ బాగా తెలుసు. అయినా షర్మిల వ్యక్తిత్వంపై ఇష్టానుసరంగా దాడి చేశారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా తనను టార్గెట్ చేయడంలో చంద్రబాబు రేవంత్ పాత్ర ఉందని జగన్ బురద చల్లేశారు. వైఎస్ వారసుడిగా తాను ఉన్నందున షర్మిల రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారాలు చూసుకుంటే బాగుండేదన్నారు. తాను సహకరించేవాడినని చెప్పుకొచ్చారు. తాను షర్మిలకు ఏమీ చెెప్పలేదని.. ఆవిడ చంద్రబాబు మాట వింటుంటే తాను ఎలా చెప్పగలనని అనేశారు. ప్రతీ విషయం చంద్రబాబుతో సంబంధం ఉందని ఎలా చెప్పగలరు అని మీడియా ప్రశ్నిస్తే “తాను నా చెల్లెలు.. నాకు తెలుసు కదా..” అని నిర్దాక్షిణ్యంగా నిందలేఏశసేశారు.
జగన్ ఇంత ఘోరంగా మాట్లాడబట్టే ఆయనకు పిచ్చి పట్టిందన్నట్లుగా షర్మిల విమర్శలు చేశారు . జగన్ ఇంగ్లిష్ ఇంటర్యూలు తెలుగులో వైరల్ కాలేదు కానీ.. జాతీయ మీడియాలో వాటిని చూసిన వారు మాత్రం ఇంత మానసిక దౌర్భల్యం ఉన్న వారు రాజకీయాల్లో ఎలా మనగలుగుతున్నారని ఆశ్చర్యపోతున్నారు.