ఫ్యాన్ గాలికి తిరుగులేదు… మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ కలిసి రావటం లేదు. అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్న జగన్ కు సైతం విషయం అర్థమవుతుందా పరిస్థితులు వైసీపీలోనే చర్చకు వస్తున్నాయి.
తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ కొరడా ఝులిపిస్తోంది. ఎక్కడా వైసీపీకి అనుకూలంగా ఉన్న వేటే అన్న స్ట్రాంగ్ మెసెజ్ పంపింది. ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ వైసీపీకి పనిచేసే అధికారులను బయటకు పంపుతుండటంతో… వైసీపీలో ఉక్కపోత మొదలైంది.
దీంతో, వైసీపీ ఇక ఈసీపై కూడా పోరాటానికి రెడీ అయ్యింది. తమకు అనుకూలంగా ఉంటే సరేసరి, లేదంటే ఎదురుదాడే అన్న వైసీపీ తన సహజ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఈసీపై కూడా ప్రయోగనించనుంది. మొన్న తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పెన్షన్ల పంపిణీపై ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించని వైసీపీ, ఇప్పుడు మిగతా పథకాలపై ఈసీ ఆంక్షలను మాత్రం బూతద్దంలో పెట్టి చూపిస్తోంది.
తెలంగాణలో పథకాలకు నో చెప్పని ఈసీ ఏపీలోనే నో చెప్తుందని… ఇది కూటమి కుట్రలో భాగమేనని ఈసీని టార్గెట్ చేసింది. అవసరం అయితే న్యాయపరంగా వెళ్తామంటూ లీకులు ఇస్తూ, ఈసీపై మైండ్ గేమ్ మొదలుపెట్టింది.