కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ లేదని వైద్యులు స్పష్టం చేయడంతో ప్రజల్లో భయాందోళనలు మరింత వ్యక్తం అవుతున్నాయి.
ఈ కొత్త రకం ఫీవర్ తో అలర్ట్ గా ఉండాలని కేరళ సర్కార్ ప్రజలను ఆదేశించింది. కొజీకోడ్, త్రిసూర్, మాలపురం జిల్లాలో ఈ ఫీవర్ కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. వెస్ట్ నైల్ గా చెప్తున్న ఈ కొత్త రకం జ్వరం క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేదని ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని పేర్కొన్నారు.
ఈ వెస్ట్ నైల్ ఫీవర్ ను గుర్తించి చికిత్స పొందటంతోపాటు వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరికైనా ఈ వెస్ట్ నైల్ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
ఈ వ్యాధి లక్షణాలు
జ్వరం
తలనొప్పి
తల తిరగడం
జ్ఞాపక శక్తి మందగించడం
కండరాల నొప్పులు