విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం ‘హార్ట్’ లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ,మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు… ఇక్కడ అయ్యన్నపాత్రుడు గెలుపు ప్రతిసారి విలక్షణంగా ఉంటుంది. “ఆయన ఒకదఫా ఎన్నికల్లో ఓడిపోతే మలిదఫా ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారు” అనేది నర్సీపట్నం ప్రజలు చెప్పే మాట. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పూరీ జగన్నాథ్ తమ్ముడైన పెట్ల ఉమా శంకర్ గణేష్ కి ఓటమిని కట్టబెట్టేలా ఉంది
నర్సీపట్నం నియోజకవర్గంలో 1999, 2004 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు వరుసగా గెలవగా… 2009 ఎన్నికల్లో ముత్యాల పాప గెలిచారు…
తర్వాత వచ్చిన 2014 ఎన్నికల్లో మళ్లీ అయ్యన్నపాత్రుడు గెలిచి తన స్థానబలాన్ని నిలబెట్టుకున్నారు…
2019లో వచ్చిన ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు మీద పెట్ల ఉమా శంకర్ గణేష్ గెలుపొందారు…
ఇప్పుడు 2024 లో మళ్లీ అయ్యన్నపాత్రుడు తన విజయాన్ని పునరావృతం చేస్తారనేది స్థానికుల మాట…
ఇందుకు సెంటిమెంట్ ఒకటే కాకుండా.. మరిన్ని కారణాలు చెబుతున్నారు. పెట్ల ఉమాశంకర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, 2019 – 2024 మధ్య నర్సీపట్నంలో అభివృద్ధి జాడే కానరాలేదన్న ‘ప్రభుత్వ వ్యతిరేకత’కి తోడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనేది ఈమధ్య ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది..
ఇలాంటి నేపథ్యంలో జరగబోతున్న ఈ ఎన్నికల్లో పెట్ల ఉమాశంకర్ గణేష్ కంటే.. అయ్యన్నపాత్రుడే పైచేయి సాధిస్తారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి!