గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం. మొదట అంబటి రాయుడు అన్నారు.. తర్వాత లావు కృష్ణదేవరాయులు అన్నారు.. తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణ అన్నారు.. చివరికి కిలారు రోశయ్యకు ఇచ్చారు. ఆయన కూడా నామినేషన్లకు ముందు నాకు వద్దు మహా ప్రభో అని విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ మార్చే చాన్స్ లేదని.. ఖర్చులంతా పెట్టుకుంటామని బుజ్జగించి బరిలో నిలబెట్టారు.
గుంటూరు సిట్టింగ్ ఎంపీ జయదేవ్ ను వేధించి వాళ్ల వ్యాపారాలపై గురి పెట్టి రాజకీయాలపై విరక్తి చెందేలా చేశామని సంతృప్తి పడ్డారు కానీ… గల్లాతో పోలిస్తే డైనోసార్ లాంటి లీడర్ వచ్చి మీద పడతారని వైసీపీ ఊహించి ఉండదు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీడీపీ జోరు పెరిగింది. ఏదో పదవి మీద ఆశతో డబ్బుల కట్టలు పట్టుకుని వచ్చారని చాలా మంది పెమ్మసాని గురించి అంచనాలు వేశారు. కానీ ఆయన తనపై అంచనాలను తలకిందులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇప్పుడు గుంటూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఆయన వాల్యూ యాడ్ చేస్తున్నారు.
గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంపై టీడీపీకి పెద్దగా హోప్స్ ఉండేవి కావు. కానీ పెమ్మసాని సీన్ మార్చేశారు. నంబూరు సుభాని తగ్గర నుంచి డిప్యూటీ మేయర్ సజీల వరకూ అందర్నీ పార్టీలో చేర్చేసుకున్నారు. ముస్లిం వర్గం ఆదరణ చూరగొడానికి తనదైన ప్రత్యేక వ్యూహం అమలు చేశారు. ఇప్పుడు ఈస్ట్ లోనూ టీడీపీ మెజార్టీలోకి వచ్చిందని అంచనాలు వస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఇప్పుడు టీడీపీకి ప్లస్ కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా చేరికలు చేపట్టారు.
పెమ్మసాని తన అభిప్రాయాలతో..వాక్చాతుర్యంతో మాస్ లీడర్ గా ఎదిగారు. క్లాస్ గా కనిపిస్తున్నా.. ఆయన చట్టసభల్లో ఉండాల్సిన వ్యక్తిగా ఎక్కువ మంది అభిప్రాయానికి వస్తున్నారు. ఏడు నియోజకర్గాల్లోనూ ఆయనకు అసెంబ్లీ అభ్యర్థల కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. అంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరుగుతోంది. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య ఇమేజ్ , వ్యక్తిత్వం , నైపుణ్యం.. సమస్యలపై అవగాహన లాంటివి చూసుకుంటే.. పెమ్మసాని దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం లేదు. అందుకే గుంటూరు లోక్ సభ ఎంపీగా పార్లమెంట్ లో అధ్యక్షా అని పిలిచే పెమ్మసానే అనే ఏకాభిప్రాయం వినిపిస్తోంది.