సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఆయనను వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆరు నెలల తర్వాత దేశద్రోహం చేశారంటూ ప్రచారం చేసి సస్పెండ్ చేశారు. కానీ ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటో మాత్రం నిరూపించలేకపోయారు. చివరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును అమలు చేసినట్లుాగ చేసి.. పోస్టింగ్ ఇచ్చి వెంటనే మరోసారి సాక్షుల్ని బెదిరిస్తున్నారన్న కారణం చెప్పి అరెస్టు చేసింది.
అంటే మొత్తంగా ఆయన గద నాలుగున్నరేళ్ల కాలంగా సస్పెన్షన్ లోనే ఉన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న ఆయన ఇంత కాలం పోస్టింగ్ లేకుండా సస్పెండ్ లో ఉన్నారు. తన సస్పెన్షన్ అక్రమం అని క్యాట్ ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్.. రెండో సారి ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో ఆయన అత్యంత సీనియర్.
ఈ నెలాఖరులో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయితే చట్ట విరుద్ధంగా సస్పెన్షన్ చేసినట్లుగా క్యాట్ తేల్చింది కాబట్టి సర్వీస్ పొడిగిపు ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఆయనపై వైసీపీ ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది