పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీబీఐ కోర్టు పర్మిషన్ అడిగారు. సీబీఐ దాఖలు చేసి కౌంటర్ ను బట్టి కోర్టు అనుమతి ఇస్తుంది. సీబీఐ వ్యతిరేకించినా ఇప్పటికి చాలా సార్లు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ సారి కూడా వస్తుందని అనుకోవచ్చు.
సీఎం అయిన తర్వాత నాలుగు సార్లు విదేశాలకు వెళ్లారు. నాలుగూ వ్యక్తిగత పర్యటనలే. అందులో ఒకదానిలో మాత్రం రెండు రోజులు దావోస్ పెట్టుబడుల సదస్సుకు కేటాయించారు. సీఎం అవగానే ఇజ్రాయెల్ వెళ్లారు. దేవుడ్ని చూడటానికి జెరూసలెం వెళ్లారు. తర్వాత కుమార్తెను కాలేజీలో చేర్పించడానికి అమెరికా వెళ్లారు. తర్వాత ఫ్యామిలీ ట్రిప్ కు దావోస్ వెళ్లారు. అక్కడ రెండు రోజులు పెట్టుబడుల సదస్సులో పాల్గొని లెంగ్తీ క్వశ్చన్స్ ఫేస్ చేశారు. తర్వాత వారం రోజులు అరబిందో శరత్ చంద్రారెడ్డి వంటి ఫ్యామిలీ స్నేహితులతో గడిపారు. ఇంకోసారి లండన్ వెళ్లారు. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో తాను ఉండకూడదని లండన్ వెళ్లారు.
అయితే అప్పుడు వెళ్లడం వేరు..ఇప్పుడు వెళ్లడం వేరు. పదవి కాలం ముగుస్తోంది. నాలుగో తేదీన వచ్చే ఫలితాలను బట్టి ఆయన రాజకీయ జీవితం ఏ మలుపులు తిరుగుతుందా అన్నది ఆధారపడి ఉంది. అందుకే ఈ పర్యటనపై ఆసక్తి ఏర్పడుతోంది. యూకే లాంటి చోట్లకు వెళ్తే.. తిరిగి రాకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు తరచూ విమర్శలు చేస్తున్నారు. కొసమెరుపేమింటంటే.. షర్మిల ఈ ఉదయమే ఓడిపోగానే విదేశాలకు పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. మధ్యాహ్నానికి విదేశీ పర్యటనకు అనుమతి కోసం పిటిషన్ వేసుకున్నారు.