చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో జగన్ ఏం చేశారయ్యా అంటే.. ఐదు వందల కోట్లతో తన కోసం ఓ విలాసవంతమైన ప్యాలెస్ ను కట్టుకున్నారు. ఎక్కడ అంటే.. రుషికొండ మీద. రుషికొండకు గుండు కొట్టి.. అన్ని రకాల పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి అత్యంత విలాసంగా నిర్మించుకున్నారు. అన్నీ తన బినామీ కంపెనీల్లాగే ఈ ఇల్లు కూడా తన కోసం కాదని.. హోటల్ అని సూట్ కంపెనీ తరహాలో ప్రచారం చేసుకున్నారు కానీ నిజం ఏమిటో ప్రజలందరికీ తెలుసు.
అసలు ఎలాంటి పాలకుడికి అయినా తన కోసం ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవాలి అనిపిస్తుందా ?. ఇప్పటికే మొండి గోడలు మాత్రమే కట్టించుకుని సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తాడేపల్లిలోని ఇల్లు, క్యాంప్ ఆఫీస్కు కనీసం వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి సోకులు చేయించుకున్నారు. రుషికొండకు గుండుకొట్టి మరో ఐదు వందల కోట్లకు టెండర్ పెట్టారు. అసలు విశాఖకే తలమానికంగా ఉన్నరుషికొండకు అలా గుండు కొట్టాలని ఎందుకనిపించింది ?. అధికారంలో ఉండి ప్రకృతి విధ్వంసం చేయడం.. చట్టాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం పెద్ద తప్పని ఎందుకు అనిపించలేదు ?. ఎందుకంటే ప్రజలంతా తన బానిసలని.. తాను రాజునని భావించడమే కారణం.
అది కూడా అత్యంత తప్పుడు పద్దతుల్లో నిర్మాణం. అంతా బాగున్న హోటల్ కాంప్లెక్స్ ను కూల్చేసి.. ఐదు వందల కోట్లతో హోటల్ కడుతున్నట్లుగా చెప్పారు. చివరికి అయ్యాఎస్లతో కమిటీ వేయించుకుని .. అది సీఎం క్యాంప్ ఆఫీసుకు బాగుంటుందని చెప్పించుకున్నారు. ఇంత పెద్ద దొంగ తెలివి తేటలు ఉన్న సీఎంను ఇంత వరకూ చూసి ఉండు తెలుగు ప్రజలు. హుదూద్ వచ్చిన్పుడు విశాఖను అంతో ఇంతో కాపాడింది రుషికొండ. ఇప్పుడు దాన్ని నరికేశారు పాలకుడు.
ఇక్కడ పాలకుడు ఎంత కుత్సిత మనస్కుడు అనేది తెలియాలంటే.. చిన్న ఉదాహరమ చెప్పుకోవాలి. తాను సీఎం అవగానే కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నట్లుగా తాను సమావేశం పెట్టిన ప్రజా వేదికను సమావేశం అవగానే కూలగొట్టేయించారు. దానికి జగన్ చెప్పిన కారణం అక్రమ కట్టడం. కానీ అది అక్రమ కట్టడం అని ఇప్పటి వరకూ తేల్చలేకపోయారు. కానీ అదే సీఎం రుషికొండపై అక్రమ కట్టడం కట్టారు. అది అక్రమ కట్టడమేనని పర్యావరణ శాఖ అధికారులు నివేదిక కూడా ఇచ్చారు. మరి ఇలాంటి సీఎంకు ఓటు వేస్తారా ?. తనకు నచ్చిందే సక్రమం.. నచ్చనిది అక్రమం అనుకునే పాలకుడికి ఓటేస్తారా ?. ఓటేసే ముందు ఒక్క సారి ఆలోచించండి.