మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే ఆ పార్టీ గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేస్తోందా..?అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో మల్కాజ్గిరి పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరగుతోంది.
సిట్టింగ్ సీటులో కాంగ్రెస్ చేసిన తప్పిదమే బీజేపీకి అడ్వాంటేజ్ గా మారిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. చేవెళ్ల అభ్యర్థిగా ఎంపిక చేస్తారని భావించిన పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం వ్యూహాత్మక తప్పిదమని అభివర్ణిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల కూడా నాన్ లోకల్ అయినా పార్టీ నేతల నుంచి ఆయనకు సంపూర్ణ సహకారం ఉండటం, బీసీ సామాజిక వర్గం మద్దతుతో ఈటల గెలుపుకు సమీపంలో ఉన్నారని టాక్ నడుస్తోంది. పట్నం సునీతకు స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతుండటంతో నియోజకవర్గంలో ఆమె ప్రభావం చూపలేకపోతున్నారని..ఈటల , పట్నం మధ్య ఓట్ల తేడా తక్కువే ఉండటంతో హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఇప్పుడే అంచనా వేయలేమని ఎనలిస్టులు చెప్తున్నారు.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో మల్కాజ్గిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీంతో పార్టీ వర్గాలు రేవంత్ చరిష్మాతో విజయం దక్కకపోదా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.