ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు డైరక్టర్ త్రివిక్రమ్. ఏపీ పాలిట ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి, కూటమిని గెలిపించాలన్నారు.
త్రివిక్రమ్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఉంది. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ఆభిమానంతో పవన్ మద్దతుగా ఓ పాట రాశారు. టాలీవుడ్ లో ఎవరైనా వైసీపీకి అనుకూలంగానే పాటలు రాయాలి..తమకే ప్రచారం చేయాలనే విధంగా వింత పోకడలు పోతున్న వైసీపీ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ ను టార్గెట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో త్రివిక్రమ్ పేరు, పర్సనల్ ఫోన్ నెంబర్ పెట్టడంతో ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 5వేల కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.
అంతేకాదు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి, తిట్లు, శాపనార్థాలు పెట్టినట్లు తెలిపారు. ఐతే, ఆయన పవన్ కు అనుకూలంగా పాట రాస్తే వైసీపీకి ఎందుకు కడుపు మంటో అర్థం కావడం లేదు. ఇలాంటి చేష్టలతో టాలీవుడ్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ కోరి మరి శత్రువులను తయారు చేసుకుంటుంది.
ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను కూడా తమ దుర్బుద్ధితో శత్రువుగా మార్చుకుంది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఏకంగా వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.