తెలంగాణకు పదేళ్లలో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ కు కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. అరవై ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఇచ్చింది వంకాయ. 120రోజుల్లో తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ అంటూ క్యాంపెయిన్ షురూ చేశారు.
తెలంగాణలో మహిళలు, నిరుద్యోగులు, మహిళలతోపాటు అన్ని వర్గాల చేతిలో రేవంత్ రెడ్డి వంకాయ పెట్టారని బీజేపీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో క్రియేటివ్ క్యాంపెయిన్ కాంగ్రెస్ ప్రారంభించి జనాలను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందుకు కౌంటర్ గా బీజేపీ వంకాయ పేరిట ప్రచారం చేస్తున్నా అది జనాలను ఆకర్షించడం లేదు.
వినూత్నరీతిలో ప్రచారం చేయాలనుకోవడం మంచిదే కానీ, వాటిని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రచార నినాదాలు, విధానాలు ఈజీగా ఉండేలా రూపొందించుకోవాలి. కానీ బీజేపీ తెరపైకి తీసుకొచ్చిన ఈ ప్రచారం జనాల్లోకి ఎక్కువగా వెళ్ళే అవకాశం లేదన్నది సుస్పష్టం.
బీజేపీ వంకాయ ప్రచారం కాంగ్రెస్ కు కౌంటర్ ఇవ్వాలనే ఆతృతతో తెరపైకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది తప్పితే జనాలను ఆలోచింపజేసే ధోరణిలో లేదని అర్థం అవుతోంది. అయినప్పటికీ బీజేపీ వంకాయ ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.