పోలింగ్ ముగియగానే కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవాలనుకున్న జగన్ కు సీబీఐ షాకిచ్చింది. ఆయన మళ్లీ తిరిగి వస్తాడన్న నమ్మకం లేదని నేరుగా చెప్పలేదు కానీ.. అలాంటి అర్థం వచ్చేలా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే జగన్ పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయని ఈ సమయం లో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని సీబీఐ స్పష్టం చేసింది. ప్రతి కేసులో జగన్ ప్రధాన ముద్దాయిగా జగన్ ఉన్నాడని గుర్తుతెలిపింది. మే 15 తేదీ న జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని కోర్టు కు తెలిపింది.
అయితే జగన్ తరపు న్యాయవాదులు జగన్ గతంలో కూడా విదేశాలకు వెళ్లాడు కానీ.. ఎక్కడా షరతులు ఉల్లంఘించలేదని గుర్తు చేశారు. రైట్ టూ ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు దాన్ని కలరాయడం సరైంది కాదన్నా జగన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే కేసుల్లో ఇరుక్కుని బెయిల్ షరతుల్లో భాగంగా అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని ఆంక్షలు ఉంటే.. తమ హక్కులకు భంగం అని జగన్ తరపు లాయర్ వాదించడం విచిత్రంగా మారింది. వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పు 14వ తేదీకి వాయిదావేసింది.
పదమూడో తేదీన పోలింగ్ ముగురస్తుంది. ఆ తర్వాత రోజు కోర్టు తీర్పు ఇస్తుంది. పదిహేడో తేదీన విమానం ఎక్కడానికి జగన్ ఎర్పాట్లు చేసుకున్నారు. కౌంటింగ్ వరకూ వస్తారో లేదో క్లారిటీ లేదు. ఒక వేళ ఓడిపోతే వస్తారన్న గ్యారంటీ లేదని టీడీపీ నేతలంటున్నారు. గతంలో ఇలాంటి అనుమతి కోసం పిటిషన్లు దాఖలు చేసినప్పుడు కోర్టు వాయిదాలు వేయలేదు. అడగగానే పర్మిషన్ ఇచ్చేది. కానీ ఈ సారి మాత్రం పోలింగ్ తర్వాతి రోజుకు వాయిదా వేసింది.