మళ్లీ డేట్ మార్చుకొన్న విశ్వ‌క్ సినిమా

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’. ఎప్పుడో రెడీ అయినా, ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మార్చిలో రావాల్సిన సినిమా ఎల‌క్ష‌న్ల వ‌ల్ల ఆగింది. ఎన్నిక‌లు అయిపోయిన వెంట‌నే ఈనెల 17న విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. చిత్ర‌బృందం కూడా అధికారికంగా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది. ఓ టీజ‌ర్ కూడా విడుద‌ల చేసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ డేట్ మారింది. ఈనెల 31న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున విశ్వ‌క్‌సేన్ ‘ఫ‌ల‌క్‌నామా దాస్‌’ విడుద‌లైంది. ఆ సెంటిమెంట్ తో రిలీజ్ డేట్ మార్చారా, లేదంటే.. ప్ర‌మోష‌న్ల‌కు స‌రిప‌డా టైమ్ దొర‌క‌డం లేద‌ని మ‌రోసారి వాయిదా వేశారా? అనేది తెలియల్సివుంది.

కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. నేహా శెట్టి, అంజ‌లి క‌థానాయిక‌లుగా న‌టించారు. టీజ‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ అయ్యింది. శాటిలైట్ హ‌క్కుల‌కు సంబంధించిన బేరాలు జ‌రుగుతున్నాయి. ఈమ‌ధ్య ధియేట‌ర్ల‌లో మాస్ సినిమా వ‌చ్చి చాలాకాల‌మైంది. దాంతో.. `గోదావ‌రి`పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మే 31నే సుధీర్‌బాబు ‘హ‌రోం హ‌ర‌’ విడుద‌ల‌కు రెడీ అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close