కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది వైసీపీ. ఇందుకోసం అప్పుడే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం స్టార్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ డబ్బు, మద్యం పంపిణీపై ఆధారపడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం ఓటర్ కు 4వేల చొప్పున పంపిణీ చేసేందుకు సరంజామాను రెడీ చేసుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక కూటమి నేతలను సైతం డబ్బు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీపై విమర్శలు వస్తున్నాయి.
ముందుగా మంగళగిరిలో డబ్బు పంపిణీని వైసీపీ షురూ చేసిందనే టాక్ నడుస్తోంది. ఎక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో ఓటర్లు ఎంత అడిగితే అంత చేతుల్లో పెట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో మంగళగిరిలో లోకేష్ ను గెలిపించుకునేందుకు టీడీపీ నేతలు కూడా పట్టుదలతో పని చేస్తున్నారు. ఎలాగైనా మంగళగిరిలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రజా వ్యతితేక విధానాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రెండు రోజుల్లో మద్యం, డబ్బు పంపిణీ మరింత పీక్స్ కు చేరుతుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.