ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం కాగానే నగదు జమ చేయడానికి అర్థరాత్రి నుంచి హడావుడి చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. కానీ ఓటర్లు ఎంత ఎదురు చూసినా డబ్బులు మాత్రం జమ కాలేదు. అసలు ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయా లేకపోతే..డ్రామా కోసం సీన్ క్రియేట్ చేశారా అన్న ది సందేహంగా మారింది.
మరో వైపు ఈసీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేఖలు రాసింది. చీఫ్ సెక్రటరీ వాటికి సమాధానాలు ఇవ్వలేదు. ఆన్ గోయింగ్ స్కీంగా భావించి డబ్బులు జమ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అసలు ఇప్పుడే ఎందుకు డబ్బులు జమ చేయాలో చెప్పాలని ఈసీ అడిగితే ఒక్క కారణం కూడా చెప్పలేదు. మరో వైపు నవతరం పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణలకో ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు ముగిసిపోయిందని తేల్చారు.
సింగిల్ జడ్జి శుక్రవారం ఒక్క రోజే చాన్సిచ్చారు. తర్వాత పోలింగ్ అయిపోయే వరకూ జమ చేయడాన్ని ఒప్పుకోలేదు. రోజంతా నిధులు జమ చేయకుండా తాత్సారం చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు టీడీపీపై ఆరోపణలు ప్రారంభించారు. తాము డబ్బులేస్తామంటే టీడీపీ అడ్డుకున్నదని చెప్పడం ప్రారంభించారు. కానీ వైసీపీ డబ్బులేయడానికి నిన్నటి వరకూ ఉన్న అడ్డంకులేమిటో.. టీడీపీ ఏం చేసిందో మాత్రం చెప్పడం లేదు. ఓటమికి కారణాలు వెదుక్కున్నట్లుగా ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.