హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో ఆయన చివరి వచ్చి నంద్యాల వచ్చారు. ఈ విషయాన్ని పట్టణం అంతా విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది జనం వచ్చేలా చేసుకోగలిగారు అభ్యర్థి. నిజానికి అల్లు అర్జున్ గత ఎన్నికల్లో రాలేదు. కానీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంత రాగ్ స్టెప్‌నో ఆయనకు వెంటనే అర్థమయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అల్లు అర్జున్ .. తన స్నేహితుడి కోసం నంద్యాల వస్తున్నారని తెలిసిన వెంటనే ఐ ప్యాక్ రంగంలోకి దిగిపోయింది. జనసేన జెండాలతో వైసీపీ నేతలు అర్జున్ పర్యటనలో హల్ చల్ చేశారు. ఇలా సిగ్గు లేకుండా జన సేన జెంాలను ఎలా వాడుకుంటారని ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ ఇలాంటి రాజకీయాల్లో వైసీపీ ఎలాంటి సిగ్గు పడదు. మిత్రుడి ఇంట్లో ఆతిధ్యం స్వీకరించిన తర్వాత అల్లు అర్జున్ నోటి నుంచి వైసీపీ అనే మాట రాలేదు. తాను తన మిత్రుడి కోసమే వచ్చానని పార్టీలతో సంబంధం లేదన్నారు.
కానీ ఆయనకు మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చి వైసీపీ మీడియా హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో ఆయన వైసీపీకి ప్రచారం చేసినట్లుగా జోరుగా ట్రెండింగ్ చేసుకున్నారు. ఇది ఆయనకు.. మెగా అభిమానులకు మధ్య మరింత దూరం పెంచేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఆయనను మెగాస్టార్ చేయడంతో పాటు జనసేన జెండాలను వాడటంతో… తన మిత్రుడు తనను ట్రాప్ చేశాడని అర్థమై ఉంటుంని ఇండస్ట్రీలో సెటైర్లు పడుతున్నాయి.