తెలంగాణ ఎన్నికల సమయంలో రైతు బంధు రాజకీయం జరిగింది. ఎన్నికల సంఘం నిధులు జమ చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ హరీష్ రావు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో మళ్లీ ఆపేసింది. అయినా సరే మీరేం బాధపడకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజే జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే పరిస్థితి సంక్షేమ పథకాల విషయంలో ఏపీలో జరుగుతోంది. గత ఆరు నెలల నుంచి పథకాలకు డబ్బులు పెండింగ్ లో పెట్టిన జగన్.. ఎన్నికలకు ముందు రిలీజ్ చేస్తానంటూ హడావుడి చేశారు. కానీ ప్లాన్ పెయిల్ అయింది.
అయితే ఇక్కడ మీరేం బాధపడకుండి.. వైసీపీకి ఓటేయండి.. తర్వాత రోజే మీ ఖాతాలో డబ్బులేస్తామని వైసీపీ చెప్పడం లేదు. రూ. పధ్నాలుగు వేల కోట్లు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి. పెండింగ్ పథకాల కోసమే ఉంచారు. చెల్లించాల్సిన అవసరమూ ఉంది. అవి పోలింగ్, ఎన్నికలతో సంబంధం లేకుండా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాల్సిన నగదు. అయినా ఎందుకు.. ఓటింగ్ అయిపోయిన తర్వాత జమ చేస్తామని చెప్పడం లేదు…?. పదమూడు తేదీ సాయంత్రానికి ఓటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. తర్వాత రోజు నగదు జమ చేసుకోవచ్చని ఈసీ కూడా చెబుతోంది.
ఎన్నికల ఫలితాలపై నమ్మకం లేని జగనమోహన్ రెడ్డి ఆ డబ్బును బినామీ కంపెనీలకు మళ్లించే అవకాశాలు ఉన్నాయని..బిల్లుల పేరుతో దోచి పెట్టుకునే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఓటర్లు బోడి మల్లన్నలేనని.. అందుకే బటన్లు నొక్కిన డబ్బులు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డిని పథకాల లబ్దిదారులు క్షమించరేమో ?