తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చంద్రబాబు పోలింగ్ సరళి.. పార్టీ నేతలను అప్రమత్తం చేయడానికి సమయం కేటాయించనున్నారు. పధ్నాలుగో తేదీన విజయం ప్రత్యేక విమానంలో విజయవాడ నంచి వారణాశి వెళ్లనున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికి మళ్లీ విజయవాడ రానున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకున్న జగన్ అంటే మోడీకి ఇష్టమని ఆ పార్టీ సానుభూతిపరులు చెప్పుకుని సంతృప్తి పడుతున్నారు. జగన్ కూడా మోడీని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. పైగా ఎన్నికలు అయిపోయిన తర్వాత తాము మోడీకి మద్దతుగా ఉంటామన్న సంకేతాలు పంపుతున్నారు. అయితే మోడీ మాత్రం జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి అభిమానం లేదని.. ఆయన ఓ రాష్ట్ర సీఎం కాబట్టి గౌరవించామని స్పష్టం చేస్తున్నారు. తెలుగు మీడియాలకు ఇచ్చిన ఇంటర్యూల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నారని తేల్చేశారు.
ఇప్పుడు తన నామినేషన్ కార్యక్రమానికి కూడా చంద్రబాబును మోదీ ఆహ్వానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, నడ్డా చెబుతున్నారు. అందుకే టీడీపీకి ప్రయారిటీ పెరుగుతోందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీగా టీడీపీ నిలిచే అవకాశాలు ఉన్నాయి.