ఒళ్లు అమ్ముకునేవాళ్లైనా కొన్ని రూల్స్ పెట్టుకుంటారేమో కానీ.. టీవీ9కి మాత్రం ఎలాంటి నైతిక విలువలు .. మీడియా రూల్స్ పెట్టుకోలేదు. నిర్భయంగా ఫేక్ వార్తలు ప్రసారం చేసేసింది. చంద్రబాబు వాయిస్ అంటూ వైసీపీ రెడీ చేసిన డీప్ ఫేక్ వీడియోను టీవీ9 ప్రసారం చేసింది. అది ఫేక్ అని మామూలు జర్నలిస్టు తేల్చేయగలడు. కానీ టీవీ9 లో కరుడు గట్టిన జర్నలిస్టులకు మాత్రం తెలియదు. తెలుసు కానీ.. ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేశారు.
సోషల్ మీయాలో కొన్ని వందల డీప్ ఫేక్ వీడియోలు ఉంటాయి. వాటిని కూడా ప్రసారం చేసే స్థాయికి దిగజారిపోంది టీవీ9. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా.. ఓటింగ్ కు టీడీపీకి నష్టం చేయడమే ప్రధాన టార్గెట్ తో ప్రసారం చేసిన ఈ వీడియో వల్ల టీవీ9కి జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. సాక్షిలో వేస్తే ఎవరూ నమ్మరని టీవీ9కి ఇలాంటివి అంటగడుతున్నారు. డబ్బుల వలలో చిక్కుకున్న టీవీ9 వాటిని ఇష్టానుసారంగా ప్రసారం చేసింది.
మీడియా సంస్థలకు ప్రజల విశ్వాసమే రక్ష. అవి కోల్పోతే మొదటికే మోసం వస్తుంది. చరిత్రలో కలిసిపోయిన ఎన్నో మీడియా సంస్థల తీరు అదే. టీవీ9కి కూడా అదే గతి పట్టబోతోంది. ఇప్పుడు ఏం చేసినా.. ఆ సంస్థ విశ్వసనీయత పెరగబోదు. ఎందుకంటే.. ఒక్క తప్పు కాదు.. చాలా తప్పులు చేశారు. టీవీ9 ఉనికి.. ప్రశ్నార్థకమయ్యేలా ఫేక్ న్యూస్ తో పునాదులు బలహీనం చేసుకున్నారు.