వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా పోలింగ్ ప్రారంభం కాక ముందే పుంగనూరు, మాచర్ల, గురజాల వంటి నియోజకవర్గాల నుంచి ఏజెంట్లపై దాడులు, అపహరణ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అయితే పోలింగ్ మాత్రం వైసీపీ వాళ్లు అనుకున్నట్లుగా మందకొడిగా సాగలేదు. పొద్దున్నే ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూలు కట్టాలు.
ప్రతి పోలింగ్ బూత్ మధ్యాహ్నం మూడు గంటల వరకూ రద్దీగానే ఉంది. ఎన్నికల సంఘానికి పూర్తి సమాచారం రావడానికి ఆలస్యం అవుతుంది కానీ.. మధ్యాహ్నం మూడు గంటల సమయానికే యాభై నుంచి అరవై శాతం నమోదియి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎండలు మరీ తీవ్రంగా లేకపోవడంతో చాలా మంది క్యూలైన్లలో ఇబ్బంది లేకండా నిల్చుకున్నారు. ఓటు హక్కువినియోగించుకుంటున్నారు.
పోలింగ్ పర్సంటేజీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని వైసీపీ అనుకుంటోందని భావిస్తున్నారు. అయితే చాలామంది ఈ దాడుల వార్తల గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాడులు జరిగిన నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. గతంలో పోస్టల్ బ్యాలెట్లతో కలిసి 80 శాతం వరకూ పోలింగ్ జరిగింది. ఈ సారి మరో రెండు, మూడు శాతం ఓట్లు అదనంగాపోయయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.