ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత ఉంటుంది. అది సహజం. కానీ ద్వేషంగా మారకూడదు. మారకుండా చూసుకోవాల్సింది పాలకుడే. కానీ పాలకుడి వికృత మనస్థత్వం కారణంగా ప్రతి ఒక్కరిని తూలనాడి.. తన ఈగో శాటిస్ఫై చేసుకోవడానికి చెలరేగిపోయి.. అధికారం అండతో అందర్నీ అవమానిస్తే ఏమవుతుంది?. తాము ఇచ్చిన అధికారంతో పీఠంపై కూర్చుని తమనే తూలనాడితే ప్రజల్లో పెరిగేది వ్యతిరేకత కాదు.. అంతకు మించి ద్వేషం. ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నది అదే.
అధికారాన్ని జగన్ రెడ్డికి దేవుడు ఇవ్వలేదు. జీసస్ అసలే ఇవ్వలేదు. ఆయనకు అధికారం ఇచ్చింది ప్రజలు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లేస్తేనే ఆయన సీఎం అయ్యారు. కానీ ఆ వర్గాలను కలాల పేరుతో విడగొట్టి ఆయా కులాల్లోని ప్రముఖుల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడాన్ని ఓ వ్యూహంగా పెట్టుకున్నారు. తనను వ్యతిరేకించేవారు ఎవరైనా సరే.. వదిలి పెట్టేది లేదన్నట్లుగా వ్యవహరించారు. రఘురామకృష్ణరాజును చంపే ప్రయత్నం చేశారు. పిఠాపురం వెళ్లి పవన్ కల్యాణ్ ను జగన్ వ్యక్తిగతంగా విమర్శించారంటే… ఓ వర్గం ఆయనను ద్వేషించడానికి ప్రత్యేకమైన కారణం చెప్పాల్సిన పని లేదు.
ఇలా ఒకరి మీద కాదు.. తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరి మీద ప్రయోగం చేశారు. అదే సమయంలో తమ మానసిక వికృత ప్రవర్తనను .. మానసిక ఆనందాన్ని పొందడానికి చిరంజీవి లాంటి స్వయంకృషితో ఎదిగిన పద్మవిభూషణ్‌ను ఘోరంగా అవమానించడానికీ వెనుకాడలేదు. జగన్ అవమానిస్తే.. కేంద్రం ఆయనకు దేశ అత్యున్నతమైన రెండో పౌరపురస్కారం అందించింది.
జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత స్థాయి నుంచి ప్రజల్లో తనపై ద్వేషం పెరిగేలా చేసుకున్నారు. దీనికి పూర్తిగా ఆయనే బాధ్యత. ఆయన మానసిక విపరీత ప్రవర్తనే కారణం తప్ప ఇంకెవరూ కాదు.