దాడులపై ఇంటలిజెన్స్ నుంచి ముందస్తు సమాచారం ఉందని సీఈవో మఖేష్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు. మరి ఎందుకు ఆపలేకపోయారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేకపోయారు. వైసీపీ ఎన్నికల్లో గెలవడానికి ఎంచుకున్న మార్గం.. దాడులు, దౌర్జన్యాలేనని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా పల్నాడు , రాయలసీమ ల్లో ఈ దాడులు ఎక్కువగా ఉంటాయని అందరూ ఊహించారు. అలాగే పోలింగ్ జరిగింది. కానీ ఈసీ మాత్రం.. ఆపలేకపోయారు. తమకు అంతా సమాచారం ఉందని మాత్రం చెబుతున్నారు.
ఈసీకి సమాచారం ఉంటే… దాడులు జరగకుండా అదనపు బలగాల్ని మోహరించాల్సి ఉంది. కానీ అలా చేయలేదు. దీని వల్ల గొడవలు జరుగుతాయని మధ్యాహ్నం నుంచి ఓటేయాలనుకున్న వారు కొంత మంది ఆగిపోయి ఉంటారు. ఈ కారణం వల్ల కొంత మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. ఇది ఈసీ వైఫల్యమే అనుకోవచ్చు.
కొన్ని పోలింగ్ బూతుల్లో గొడవల కారణంగా ఓటింగ్ ఆగిపోయింది. రీపోలింగ్ పెట్టే ఉద్దేశం లేదని సీఈవో చెబుతున్నారు. రీపోలింగ్ అవసరం లేని ఎన్నికలు టార్గెట్ గా పెట్టుకుంటే.. స్మూత్ గా ఎన్నికలు జరిగిపోయేలా చూాడాలి కానీ.. పగిలిపోయిన ఈవీఎంలలో చిప్ భద్రంగా ఉంటుందని.. కౌంటింగ్ చేయవచ్చని చెబితే.. ఈసీ ఓకే అంటోంది. పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర నుంచి పోలింగ్ వరకు ఈ విషయంలో ఈసీ పనితీరు అంచనాలను అందుకోలేదని అనుకోవచ్చు.