సవాళ్లూ ప్రతిసవాళ్లే సభను కాలబెట్టినారు
విలువల ఆనవాళ్లు లేకుండా సమయం తగలెట్టినారు
జనం గూర్చి కాస్తయినా చర్చలచట జరిగేనా?
తిట్ల దండకాలు తప్ప.. మరో ముచ్చటసలు ఉండేనా?
అర్థవంతమైన చర్చలకు చెల్లిపోయె కాలం
సమర్థులైన నాయకులకు పట్టెనండి గ్రహణం
సభా మర్యాద, సాంప్రదాయం మిథ్య అగుట ఖర్మం
రాజకీయ స్వార్థపరతే ఈ పోకడలలో మర్మం
విలువైన శాసనసభా సమయం వృథా అయిపోతున్నది. అసలు చర్చజరగాల్సిన కీలకాంశాలన్నిటినీ పక్కన పెట్టేసి.. ఏది ఎత్తుకుంటే అదే టాప్ ప్రయారిటీ అన్నట్లుగా రాజకీయ పార్టీలు దాన్నే పట్టుకుని కొట్టుకుంటూ ఉండడంతో సభా సమయం గడచిపోతున్నది. బుధవారం నాడు సభా సమయం మొత్తం ఇలాగే వృథా కావడం గమనార్హం. భూదందాల పేరుతో.. వైకాపా వారు రోజంతా ఆందోళనాత్మకంగానే గడపడంతో.. చివరికి వారి పార్టీ సభ్యులందరి సస్పెన్షన్ వరకు అది దారితీయడం విశేషం.