ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి,చినికి గాలివానలా మారడంతో జిల్లాలో 144సెక్షన్ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. దుకాణాలను ఓపెన్ చేసేందుకు కూడా విముఖత కనబస్తున్నారంటే పల్నాడులో పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పల్నాడు జిల్లా ఘర్షణలతో భగ్గుమంటుంటే సీఎం హోదాలో జగన్ రెడ్డి మాత్రం మౌనం వీడటం లేదు. పెద్దన్న పాత్రలో ఇరు వర్గాల ఘర్షణలకు ముగింపు పలికేలా వైసీపీ కార్యకర్తలు శాంతించాలని జగన్ ప్రకటన చేయకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్ళు కార్యకర్తలే వైసీపీ బలమని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్ రెడ్డి హింసాత్మక ఘటనల్లో ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు అవుతే వారికి అండగా నిలిచేది ఎవరనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. పరిస్థితులు సద్దుమణిగేలా జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని పార్టీలో కూడా చర్చ జరుగుతోంది.
రెండు రోజుల నుంచి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు కానీ, జగన్ మాత్రం మౌనముని పాత్ర పోషించడం ఆ పార్టీ నాయకులకు సైతం నచ్చడం లేదని టాక్ వినిపిస్తోంది. జగన్ వైఖరి చూస్తుంటే అధికారం కోల్పోతున్నట్లు అంచనాకు వచ్చే ఈ కల్లోల పరిస్థితిపై కాముష్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.