ఎమ్మెల్యేగా మహిళల సంరక్షణకు తోడ్పాటు అందించాల్సిన వైసీపీ ఎమ్మెల్యే బరితెగించాడు. ఇంట్లో ఎవరూ లేరని ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించిన వీడియో ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డా. సుధాకర్ బాబు ఓ యువతితో అసభ్యంగా వ్యవహరిస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. ఎన్నికల రోజే ఆ వీడియో బయటకు రావడంతో ఈ ఘటన ఇంతకుముందే జరిగిందా..? వైసీపీని ఇరకాటంలోకి నెట్టేసేందుకు తాజాగా ఈ వీడియోను బయటపెట్టారా..? అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల రోజే ఈ వీడియో వైరల్ కావడంతో నియోజకవర్గ ప్రజలు విస్తుపోయారు. ఎమ్మెల్యేగా, డాక్టర్ బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిందిపోయి ఇలా బరి తెగిస్తారా..? అని ప్రజలు అవాక్కయ్యారు.
2019లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన సుధాకర్ బాబుకు ఈసారి జగన్ టికెట్ కేటాయించలేదు. కారణం ఏమిటో కానీ, తాజాగా ఈ వీడియో బయటకు వచ్చాక సుధాకర్ బాబు అసలు బాగోతం తెలిసే వైసీపీ టికెట్ నిరాకరించిందా..? అని డిబేట్ మొదలు పెట్టారు. గతంలోనూ ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.
తాజాగా బయటకు వచ్చిన వీడియోలో సదరు యువతితో ఎమ్మెల్యే సంభాషణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇస్తాను. ఇంట్లో మేడం కూడా లేదంటూ సాగించిన రాసలీలల సంభాషణ కర్నూల్ జిల్లా అంతటా చర్చనీయాంశం అవుతోంది