ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాత్మక ఘటనలకు కారణం చూపి కొంతమంది పోలీసు అధికారులపై ఈసీ వేటు వేసింది. ఇలా పలువురిపై వేటు వేసేలా… తప్పంతా వాళ్లపై తోసేసి నివేదికలు ఇచ్చింది సీఎస్ జవహర్ రెడ్డినే. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని ఈసీ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు.
మరి ఈ హింసాత్మక కుట్ర రాజకీయాలకు బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు ?. ఏపీలో ఎన్నికల వ్యవస్థ ప్రతి దశలోనూ అపహాస్యం పాలవడానికి చీఫ్ సెక్రటరీనే కారణం. చేతకానితనం కొంత.. జగన్మోహన్ రెడ్డిపై భయభక్తులు కొంత కలిపి ఆయన రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడంలో ప్రధాన నిందితుడిగా నిలిచారు. తన నిర్వాకంతో పెద్ద ఎత్తున వృద్ధులు చనిపోవడానికి కారణం అయ్యారు. అయినా ఆయనను ఈసీ బదిలీ చేయలేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు.
ఈసీ ఆదేశాలను పక్కగా పాటించేలా చేయడంలో సీఎస్ ది కీలక పాత్ర. అక్కడే అసలైన కిటుకును పట్టుకున్న ఆయన చెలరేగిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన తన కింద పని చేసిన వారిపై వేటు వేయిస్తున్నారు కానీ.. తానే సేఫ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన సీఎస్ గా ఉంటూ కౌంటింగ్ జరిగితే అంతకు మించిన కుట్రలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి మారుస్తారో లేదో !