ఎన్టీఆర్ సొంత ఇంటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ భూమి కొని మోసపోయాడని, ఈ కేసు విషయంలో హైకోర్టు వరకూ వెళ్లాడన్నది సదరు వార్త సారాంశం. 2003లో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడే ఇల్లు కూడా కట్టుకొన్నారు. అయితే ఆ స్థలం బ్యాంకు తనఖాలో ఉందని, ఇప్పుడు ఆ స్థలాన్ని సదరు బ్యాంకులు స్వాధీనం చేసుబోతోతున్నాయని, ఈ విషయమై ఎన్టీఆర్ కోర్టుకెళ్లారని వార్తలొచ్చాయి.
వీటిపై ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ ఉంటున్న నివాసానికి సంబంధించిన గొడవ కాదని, జూబ్లీహిల్స్ లో మరో చోట ఎన్టీఆర్ పేరుతో ఓ ఖాళీ స్థలం ఉందని, దానికి సంబంధించిన ఇష్యూ అని స్పష్టం చేసింది. అయితే ఆ స్థలాన్ని సైతం ఎన్టీఆర్ 2013లోనే అమ్మేశార్ట. అంటే.. ప్రస్తుతం వివాదాల్లోకి ఎక్కిన ఆ స్థలానికీ ఎన్టీఆర్‌కూ ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి, ఈ ఇష్యూలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ఎన్టీఆర్ టీమ్ కొరింది.
స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తున్న మాట వాస్తవమే. ఆ స్థలాన్ని ఒకప్పుడు ఎన్టీఆర్ కొనుగోలు చేసిన మాటా నిజమే. కానీ… ప్రస్తుతానికి ఆ స్థల యజమాని ఎన్టీఆర్ కాదు. అదీ.. మేటరు.