ట్విట్టర్ ఖాతాను డీ యాక్టివేట్ చేసి ఒకరోజు కూడా గడవకముందే మళ్లీ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఆయన ఎందుకు ట్విట్టర్ ఖాతాను డీ యాక్టివేట్ చేశారో తిరిగి ఎందుకు యాక్టివేట్ చేశారో కాని మరోసారి నాగబాబు వైఖరి నెట్టింట తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.
ఉన్నట్టుండి నాగబాబు శుక్రవారం ట్విట్టర్ ఖాతాను డీ యాక్టివేట్ చేశారు. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్…అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే… మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే …అంటూ నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.బన్నీ వైసీపీ నంద్యాల అభ్యర్థికి ప్రచారం చేయడంతోనే నాగబాబు ఈ ట్వీట్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతుండగానే ఆయన ట్విట్టర్ ఖాతాను డీ యాక్టివేట్ చేసి, ఒక రోజు తిరగకుండానే మళ్లీ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి మరో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
నేను నా ట్వీట్‌ని డిలీట్ చేశాను అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ డిలీట్ చేశారు..? ఎందుకు డిలీట్ చేశారంటూ నెటిజన్లు నాగబాబును ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నే డిలీట్ చేసినట్లుగా ఆయన ట్వీట్ ఉందనే డిస్కషన్ జరుగుతోంది.
https://x.com/NagaBabuOffl/status/1791709323577401535