శివరాత్రి నాడు శివనామస్మరణతో రాత్రి అంతా గడపాలని అలా చేస్తే సమస్యలన్ని సమసి పోతాయని భక్తుల నమ్మకం. అయితే ఆరోజు జాగరణ కార్యక్రమం జరిపితే చాలా మంచిదని ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితి. ఇక శివరాత్రి నాడు థియేటర్స్ లో కూడా మిడ్ నైట్ షోలు వేయడం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ శివరాత్రి రోజు సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు హవా కొనసాగిందని చెప్పాలి.
హైదరబాద్ లాంటి సిటిల్లోనే కాదు అన్ని చోట్ల శ్రీమంతుడు సినిమా వేయడం జరిగింది. రామ రామ రామ రామా.. రామదండులాగ అందరొక్కటవుదామా అని సినిమాలో సాంగ్ ఉన్నట్టుగా శ్రీమంతుడు సినిమా చూసేందుకు ప్రేక్షకులు మరోసారి ఉత్సాహం చూపించారు. ఇక హైదరాబాద్ లో ఈ సినిమా 27 షోస్ పడగా వాటి వల్ల వచ్చిన ఆదాయం 21 లక్షల రూపాయలు అని తేలింది. మిగతా సినిమాల కన్నా శివరాత్రి నాడు ఎక్కువ సందడి చేసిన సినిమా శ్రీమంతుడు అనే చెప్పాలి.
ఈ లెక్కన శ్రీమంతుడు సినిమా మరోసారి స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిందని అనుకుంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా గ్రామాల దత్తత కథాంశంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుని టాలీవుడ్ సెకండ్ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ సృష్టించింది.