యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను ఏపీకి తీసుకు వచ్చారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ చేయాలన్న లక్ష్యంతో తీసుకొచ్చి ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఇది ఒకటి. 2019లో జగన్ సీఎం అయ్యాకనే ఉత్పత్తి ప్రారంభించింది. కానీ ఇప్పుడు పరిశ్రమను తమిళనాడుకు తరలించాలని నిర్ణయించుకుంది.
ఫాక్స్‌లింక్ సంస్థలో దాదాపుగా రెండు వేల మంది పని చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆ సంస్థలో అగ్నిప్రమాదం సంభవించింది. అంతకు ముందు అమరాజా పరిశ్రమలోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమల్లో ఈ మిస్టీరియస్ అగ్నిప్రమాదాల కారణాల్ని తేల్చలేకపోయారు. కానీ అగ్నిప్రమాదం తర్వాత ఫాక్స్ లింక్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేసే ఆలోచన చేయలేదు. దీంతో ఫాక్స్ లింక్ యాజమాన్యం దండం పెట్టేసింది.
తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తమ యూనిట్ ను చెన్నైకు తరలించాలని నిర్ణయించుకుంది. ఒప్పందాలు అయిపోయాయి.. అక్కడ తమ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నిర్మించడం ప్రారంభించారు. అసలే ఇన్వెస్ట్ మెంట్స్ తెచ్చేది లేదు.. కానీ ఉన్న వాటిని కూడా కాపాడే ఆలోచన చేయలేదు. ఉద్యోగాలు యువతకు ఉంటే ఎంత లేకపోతే ఎంత.. అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది.
ఒక్క పరిశ్రమ మ్యాటర్ కాదు.. ఇక్కడ ఎకో సిస్టమ్‌పై పారిశ్రమ వర్గాల్లో ఎంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు. మరొకరు ఇన్వెస్ట్ మెంట్ అంటేనే ఏపీ పేరును కొట్టేసే పరిస్థితి వచ్చింది.