ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్ కంపోజిషన్, హైపవర్ తో నిండిపోయిందీ పాట.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం దేవర పాత్రని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసింది.
♫అగ్గంటుకుంది సంద్రం.. భగ్గున మండే ఆకాశం..
దేవర మౌనమే సమరమే లేని హెచ్చరిక
రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త…. దేవర ముందు నువ్వెంత♫ అంటూ పాటలో వినిపించిన లిరిక్స్ హీరోయిజంను మరోస్థాయిలో నిలబెట్టాయి.
స్వరకర్త అనిరుధ్ రవిచందర్ స్వయంగా తన హై ఎనర్జిటిక్ వాయిస్ తో కావాల్సినంత మాస్ ని నింపాడు. అయితే కొన్ని పదాలని ఉచ్ఛరించడంలో స్పష్టత కొరవడినట్లుగా అనిపించింది.
ఈ పాట కోసం స్పెషల్ గా మ్యూజిక్ టీంతో వీడియోని ఒక కాన్సెప్ట్ లా షూట్ చేయడం బావుంది. దేవర టీజర్ లో చూపిన తీర ప్రాంతం లొకేషన్ లో అనిరుధ్ అండ్ టీంపై కొన్ని విజువల్స్ తీసి ఆల్బమ్ గా చేశారు. అలాగే పాట మధ్యలో చూపించిన దేవర విజువల్స్ లో కొన్ని కొత్త యాక్షన్ షాట్స్ ఆసక్తికరంగా వున్నాయి. ఈ పాట చూస్తుంటే దేవరలో భారీ యాక్షన్ విద్వంసం, రక్తపాతం వుంటుందని అర్ధమౌతోంది. మొత్తనికి ఈ పాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషి చేసేలావుంది. దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1.. అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.