యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ షూట్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కొంతకాలం రిలాక్స్ గా ఉన్న బాడీని మళ్లీ ఫిట్ గా చేసుకుని షూటింగ్ కు సిద్ధమయ్యాడు మన అమరేంద్ర బాహుబలి. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాల గురించి ఇప్పటినుండే డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే రన్ రాజా రన్ తో హిట్ కొట్టిన సుజిత్ ఎన్నాళ్లనుండో ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో జిల్ దర్శకుడు రాధాకృష్ణ కూడా చేరిపోయాడు.
గోపిచంద్ ను స్టైలిష్ హీరోగా చూపించి వారెవా అనుకునేలా చేశాడు డైరక్టర్ రాధాకృష్ణ.అయితే ఇప్పుడు అదే జోష్ తో ప్రభాస్ తో ఓ లవ్ స్టోరీ తీయాలనే ఆలోచనలో ఉన్నాడట రాధాకృష్ణ. అంతేకాదు ఇందులో అసలు యాక్షన్ అంశాలు లేకుండా ప్లాన్ చేస్తున్నాడట డైరక్టర్ రాధాకృష్ణ. మరి ప్రభాస్ సినిమాలో ఫైట్స్ లేకుండా ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు ఊహించగలుగుతారా లేదా అన్నది చూడాలి.
అసలే బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ను ఏర్పాటుచేసుకున్న ప్రభాస్ యాక్షన్ సీన్స్ లేకుండా సినిమా అంటే పెద్ద ప్రయోగానికి సిద్ధమైనట్టే. అయితే ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాలు ఎంత స్టైలిష్ గా హిట్ అందుకున్నాయో మనకు తెలుసు. రాబోయే ఈ సినిమా కూడా అదే ఫార్ములాతో వస్తుందని అనుకోవచ్చు. మరి సుజిత్, రాధాకృష్ణ ఇద్దరిలో ప్రభాస్ ఎవరికి ముందు ఒకే చెప్తాడో త్వరలో తెలుస్తుంది.